Abn logo
Jan 20 2021 @ 17:49PM

బెంగాల్: ర్యాలీలో బీజేపీ కార్యకర్తల వివాదాస్పద వ్యాఖ్యలు

కోల్‌కతా: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుంటారు. మిగతా పార్టీల నేతలు, కార్యకర్తలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ బీజేపీ నేతల నుంచి తరుచూ అవి దొర్లుతుంటాయి. ప్రగ్యా ఠాకూర్, అనంతర్ కుమార్ హెగ్డే, విప్లవ్ దేవ్, కపిల్ మిశ్రా లాంటి నేతలు అయితే తరుచూ ఈ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో కమలం కార్యకర్తలు రెచ్చిపోయారు. వందల మందితో తీస్తున్న ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ్ కీ గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో’’ (దేశ ద్రోహులను కాల్చి పారేయాలి) అంటూ ర్యాలీ నిర్వహించారు. విచిత్రం ఏంటంటే.. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ యూనిట్‌కి చెందిన బీజపీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.


పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బెంగాల్ బీజేపీ పెద్దలు కూడా హజరయ్యారు. అయితే ర్యాలీ కొనసాగుతుండగానే కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి ‘‘దేశ్ కీ గద్దారోంకో’’ అని అరుస్తూ ఉంటే మిగిలిన వారు ‘‘గోలీ మారో సాలోంకో’’ అంటూ ప్రతి నినాదాలు ఇస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement