Abn logo
Jun 1 2020 @ 19:57PM

మరో వారం రోజుల్లో బిహార్‌లో సమర శంఖం పూరించనున్న బీజేపీ

పాట్నా : మరో వారం రోజుల్లో బీజేపీ బిహార్‌లో  ఎన్నికల శంఖారావాన్ని  మోగించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దీనికి నాంది పలకనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిహార్ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అమిత్‌షా ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుందని బీజేపీ నేతలు వెల్లడించారు.


బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ.. దాదాపు లక్ష మందిని బీజేపీ వైపు తిప్పడమే టార్గెట్‌గా పనిచేస్తున్నామని, సోషల్ మీడియా వేదికగా అమిత్‌షా ఉపన్యాసాన్ని వినేలా తాము భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షా చేస్తున్న ప్రసంగమే బిహార్ ఎన్నికలకు నాందీ ప్రస్తావన అని ఆయన వెల్లడించారు. షా ప్రసంగించిన కొన్ని రోజులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రసంగించనున్నారని, అయితే ఈయన ప్రసంగం రెండు దశల్లో సాగనుందని జైస్వాల్ ప్రకటించారు. 

Advertisement
Advertisement
Advertisement