Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‎ను బరాబర్ జైలుకు పంపిస్తాం: MP Arvind

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఫస్ట్ టైమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, నేతలు చిల్లరగా, చాలా నీచంగా దారుణమైన పదజాలంతో మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై..  తీవ్రస్థాయిలో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అర్వింద్...

సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేతను బరాబర్ జైలుకు పంపిస్తామని, ఎప్పటికైనా కేసీఆర్‎ ఖచ్చితంగా జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన అవినీతే ఆయన్ను జైలుకు పంపిస్తుందన్నారు. అవీనితిపై ఆధారాలను ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామన్నారు. కేసీఆర్‎కు మతిమరుపు ఎక్కువైందని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్‎లోనే విశ్రాంతి తీసుకోవాలన్నారు.


వరి ధాన్యాన్ని కేంద్రం ఎప్పుడు కొనుగోలు చేయమని చెప్పలేదని స్పష్టం చేశారు. మిల్లులను మాత్రమే ఆధునీకరించుకోమని లేఖలో కేంద్రం రాసిందన్నారు. హుజురాబాద్ ఓటమిని సీఎం జీర్ణించుకోలేకపోతున్నారని, బీజేపీ గెలుపు నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ తంటాలు పడుతున్నారని అరవింద్ చెప్పుకొచ్చారు. జామపండు సీతాఫలానికి తేడా తెలియని వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ చదువు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ధర్మపురి అరివింద్ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement