Abn logo
Aug 7 2020 @ 03:50AM

సింహాచలం భూములపై కన్నేశారు: మాధవ్‌

విశాఖపట్నం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌... ఇద్దరూ ఒకేలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ విమర్శించారు. ‘‘నాడు చంద్రబాబు... అమరావతిని కేంద్రంగా చేసుకొని కుంభకోణాలకు పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వాటిపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు చేపట్టాలి. అంతేతప్ప భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం ఎందుకు చేస్తోంది? నాడు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్‌... అధికారంలోకి వచ్చిన తరువాత మాట మాట మార్చారు. విశాఖలో పరిపాలన రాజధాని పేరుతో సింహాచలం భూములపై కన్నేశారు. బిల్డ్‌ ఏపీ పేరిట ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు’’ అని మాధవ్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement