విజయవాడ: ఛలో డీజీపీ ఆఫీసు ముట్టడికి పిలుపు ఇచ్చిన బీజేపీ నేతలను పోలీసులు విజయవాడలో హౌస్ అరెస్టు చేశారు. ఆలయాల ధ్వంసం కేసులో దోషులను పట్టుకోకుండా.. బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ ప్రకటించడం దారుణమని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. కూలగొట్టినట్లు ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా మంగళగిరి గాలిగోపురం సెంటర్లో ధర్నా చేపడతామని ప్రకటించారు. శాంతి యుతంగా నిరసన కూడా తెలపనీయకుండా హౌస్ అరెస్టు చేయడమేంటని పాతూరి నాగభూషణం ప్రశ్నించారు.