Abn logo
Sep 17 2021 @ 10:04AM

నిజాంకు, కేసీఆర్‌కు ఎలాంటి తేడా లేదు: Laxman

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మజ్లిస్ పార్టీకి లొంగి.. కేసీఆర్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లీస్‌కు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను తెరమరుగు చేస్తున్నారన్నారు. నిజాంకు, కేసీఆర్‌కు ఎలాంటి తేడా లేదని...ఊసర వెల్లిలా కేసీఆర్ రంగులు మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరుస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...