Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో ‘రివర్స్ బెడ్జెటింగ్’లా ఆర్థిక నిర్వహణ: Lanka dinakar

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక నిర్వాహణ "రివర్స్ బడ్జెటింగ్" లా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ నుండి కార్పోరేషన్లకి కేటాయింపులుంటాయని... కానీ ఏపీలో కార్పోరేషన్ అప్పుల నుండి బడ్జెట్‌లో పేర్కొన్న వ్యయానికి ఖర్చు చేస్తున్నారన్నారు. కార్పోరేషన్ అప్పులను బడ్జెట్ కేటాయింపుల వ్యయం కోసం చెల్లింపులు చేయడం ఆర్థిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని తెలిపారు. బడ్జెట్ వ్యయాన్ని బడ్జెట్ వసూళ్ల నుండి మాత్రమే కన్సలిడేటెడ్ ఫండ్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. బడ్జెట్ అప్పులు ఎఫ్.ఆర్.బీ.ఏం పరిధిలో చేయాలని... కాని కార్పోరేషన్‌లో బడ్జెట్‌లో ఆదాయాన్ని చూపి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఫండ్ డైవర్షన్ చేస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్పోరేషన్ అప్పులు కూడా బడ్జెట్‌లోని అప్పులకు కలిపి ఎఫ్.ఆర్.బీ.ఏం పరిధిలో ఉన్నాయో లేదో చూడాలని లంకా దినకర్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement