Abn logo
Jun 4 2020 @ 03:28AM

జగమొండి విధానాలు మానుకోవాలి: జీవీఎల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా జగమొండి విధానాలు మానుకోవాలి. నా రాష్ట్రం... నా ఇష్టం అన్న విధంగా అహంతో వ్యవహరిస్తే కోర్టుల నుంచి జగన్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పవు. ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వైసీపీ రంగులు వేస్త్తున్నారన్న కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ’’ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విషయంలో కూడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.

Advertisement
Advertisement
Advertisement