Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 12:33PM

Uttar Pradesh:బీజేపీ నాయకుడికి 5 డోసుల కొవిడ్ వ్యాక్సిన్!

వాస్తవానికి విరుద్ధంగా టీకా సర్టిఫికెట్‌లో వెలుగులోకి...

మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడికి ఇప్పటికే ఐదు డోసుల కొవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారని, అతనికి ఆరవ డోస్ షెడ్యూల్ చేసినట్లు అతని టీకా సర్టిఫికెట్‌లో వెల్లడైంది.మీరట్ నగరంలోని సర్ధనా ప్రాంతం బూత్ నంబరు 79 బీజేపీ అధ్యక్షుడైన రాంపాల్ సింగ్ (73) తన టీకా సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వాస్తవానికి రాంపాల్ సింగ్ కు రెండు డోసుల టీకాలు మాత్రమే తీసుకున్నారు. కాని అతని టీకా సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకుంటే ఐదు డోసుల టీకా తీసుకున్నట్లు, మరో టీకా కోసం షెడ్యూల్ చేసినట్లు ఉంది. దీంతో రాంపాల్ సింగ్ ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి రాంపాల్ సింగ్ మొదటి డోస్ కొవిడ్ టీకాను ఈ ఏడాది మార్చి 16వతేదీన, రెండవ డోస్ మే 8వతేదీన తీసుకున్నాడు.కాని సింగ్ తన అధికారిక సర్టిఫికెట్‌ను అధికారిక పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు, ఇప్పటికే ఐదుడోసుల వ్యాక్సిన్ పొందాడని, డిసెంబర్ 2021 ,జనవరి 2022ల మధ్య ఆరో డోస్ టీకా కోసం షెడ్యూల్ చేసినట్లు సర్టిఫికెట్ లో చూపించింది.సర్టిఫికెట్ ప్రకారం తాను మార్చి 16న మొదటి డోస్ కొవిడ్ టీకా, రెండో డోస్ మే 8న, మూడోది మే 15న, నాల్గవది సెప్టెంబరు 15వ తేదీన టీకాలు తీసుకున్నట్లు సర్టిఫికెట్ లో అధికారికంగా వెల్లడైంది. వాస్తవానికి విరుద్ధంగా ఎక్కువ సార్లు టీకా తీసుకున్నట్లు నమోదవడం మొట్టమొదటిసారి అని,ఇది హ్యాకింగ్ వల్ల జరిగిందోమోనని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement