Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్‌పై దాడి: DK Aruna

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్‌పై దాడి జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌పై దాడులు చేయమని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. బెంగాల్ తరహా రాజకీయాల్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ తెర తీశారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. తన ప్రలోభాలకు లొంగనందుకు హుజురాబాద్ ప్రజలపై కేసీఆర్ పగ పెంచుకున్నారని తెలిపారు. వానా కాలం పంటను ఎందుకు కొనటం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంతో ఒప్పందం ప్రకారమే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే బీజేపీ భయపడదని డీకే అరుణ స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement