Abn logo
Jul 12 2020 @ 00:33AM

ఎక్కువగా అవసరమున్న వారికే కరోనా వ్యాక్సిన్ ముందుగా అందాలి: బిల్‌గేట్స్

వాషింగ్టన్: కరోనా మహమ్మారికి విజయవంతమైన వ్యాక్సిన్ తయారైతే ఎక్కువ అవసరం ఉన్న దేశాలకు, ప్రజలకే ఆ వ్యాక్సిన్ ముందుగా అందాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థపకులు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మాటలు చెప్పారు. కరోనాకు సంబంధించిన డ్రగ్స్, వ్యాక్సిన్‌ను ధనిక దేశాలకు, ప్రజలకు ముందుగా ఇస్తే కరోనా మహమ్మారి కారణంగా మరింత మంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ను అందరికి న్యాయంగా అందజేసేలా నిర్ణయాలు తీసుకునే నాయకులు ప్రస్తుతం ప్రపంచానికి అవసరమని బిల్‌గేట్స్ తెలిపారు. మరోపక్క హెచ్ఐవీ, ఎయిడ్స్‌, టీబీ, మలేరియాతో పోరాడేందుకు గతంలో ప్రపంచం మొత్తం కలిసికట్టుగా ముందుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ మందును ప్రపంచంలో అవసరమైన ప్రతిఒక్కరికి అందేలా ప్రతి ఒక్క దేశం కృషి చేసిందని బిల్‌గేట్స్ అన్నారు. కాగా.. ప్రస్తుతం కరోనాకు విజయవంతమైన వ్యాక్సిన్‌ను బయటకు తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా వందలాది కంపెనీలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందకుండా ధనిక దేశాలు వ్యాక్సిన్‌ను తమ దేశాలకు తీసుకువెళ్లిపోతాయన్న ఆందోళన మొదలైంది. 


Advertisement
Advertisement
Advertisement