Advertisement
Advertisement
Abn logo
Advertisement

బైక్‌ల దొంగ అరెస్టు

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 27 : మోటారుసైకిళ్ల చోరీలకు పాల్పడిన ఆది నరసింహులు అనే బైక్‌ల దొంగను మూడవ పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి మూడు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్‌ఐ రాజగోపాల్‌ విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ వై.ప్రసాదరావు అదేశాలతో సీఐ ఆనందరావుకు రాబడిన సమాచారంతో తాను తన సిబ్బందితో కలిసి బొల్లవరం క్రాస్‌లో అదే ప్రాంతానికి చెందిన ఆది నరసిహులులు అరెస్టు చేసి, బుల్లెట్‌ బండిని స్వాధీనం చేసుకున్నారని, అదే విధంగా అతని నుంచి మరో రెండు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.2లక్షలుగా ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రిమాండుకు అదేశించినట్లు ఎస్‌ఐ చెప్పారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement