Abn logo
Jul 12 2021 @ 07:16AM

Bihar Police Issued Alert యూపీలో ఇద్దరు ఉగ్రవాదుల పట్టివేత: బీహార్ రైల్వే స్టేషన్లలో అలెర్ట్!

పట్నా: Bihar Police Issued Alert ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అల్ ఖైదాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడిన నేపధ్యంలో బీహార్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల రైల్వే స్టేషన్లకు అలెర్ట్ జారీ చేశారు. ఈ సందర్భంగా బీహార్ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక శాఖతో పాటు సిఐడి... రాష్ట్రంలోని అన్ని సున్నిత ప్రాంతాల్లోనూ, సరిహద్దుల్లోనూ అధికారులు అప్రయత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. కాగా యూపీ రాజధాని లక్నోలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారు స్వాతంత్ర్య దినోత్సవాలకు ముందు దుశ్చర్యకు పాల్పడేందుకు పథకం పన్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు లక్నోకు చేరుకుని, దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ ఘటన అనంతరం బీహార్‌లోని అన్ని ప్రముఖ స్థలాల్లోనూ హై అలెర్ట్ ప్రకటించారు.