Abn logo
Jul 13 2020 @ 16:24PM

శిల్పారెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన నటుడు సామ్రాట్

అక్కినేని సమంత ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి.. మూడు మొక్కలను నాటి.. ఈ ఛాలెంజ్‌కు మరో నలుగురిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఉపాసన కొణిదెల, సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మీ, నటుడు సామ్రాట్‌లను ఈ ఛాలెంజ్ స్వీకరించాలని ఆమె కోరారు. ఆమె నామినేట్ చేసిన వారిలో నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ సామ్రాట్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి.. మొక్కలు నాటారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని, దీనిని అస్సలు వదిలిపెట్టవద్దని, మరింత ముందుకు తీసుకువెళ్లేలా తాను కూడా ప్రయత్నం చేస్తానని తెలిపారు.


మొక్కలు నాటిన అనంతరం సామ్రాట్ మాట్లాడుతూ.. ‘‘నా సోదరి శిల్పారెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ మొక్కను నాటుతున్నాను. ఈ ఒక్కటే కాదు మున్ముందు ఇంకా ఎన్నో మొక్కలు నాటుతాను. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నన్ను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి. కరోనా వైరస్ ఉన్నా సరే.. ఈ కార్యక్రమాన్ని అస్సలు ఆపవద్దు. ఇంకొన్ని మొక్కలు నాటిన తర్వాత నేను కూడా కొందరిని నామినేట్ చేస్తాను. రెడీగా ఉండండి.  ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్‌గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను..’’ అని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement