బిగ్‌బాస్‌ ఫేమ్‌ నగలు, నగదుతో పారిపోయిన ప్రియుడు..

పెళ్ళి చేసుకుంటానని మోసగించి తన వద్ద నగలు, నగదు దోచుకుని పరారైన ప్రేమికుడిపై చర్యలు తీసుకోవాలంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ జూలీ అమింజికరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరీనాబీచ్‌లో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో కొత్త రకం నినాదాలతో హోరెత్తించిన జూలీ తమిళ బిగ్‌బాస్‌ కార్యక్రమం ద్వారా ప్రజలకు బాగా పరిచయమైంది. ఆ నేపథ్యంలో అమింజికరై అయ్యావు కాలనీలో నివసిస్తున్న మనీష్‌ (26) అనే యువకుడిని నాలుగేళ్లపాటు ప్రేమించింది. మనీష్‌ ఆమెను త్వరలో పెళ్ళి చేసుకుంటానని నమ్మించి విలువైన బైకు, రిఫ్రిజరేటర్‌, నగలు, నగదు తీసుకుని పారిపోయాడు. అతడి ఆచూకీ తెలియకపోవడంతో శనివారం జూలీ అమింజికరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement