Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాకుళం జిల్లా వైసీపీకి మరో భారీ షాక్

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. రేగిడి మండలం శిర్లం పంచాయతీలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీమంత్రి కొండ్రు మురళి నేతృత్వంలో వైసీపీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దూకుడు పెంచింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులు చేయడానికి టీడీపీ సంకల్పించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి జిల్లా పెట్టని కోట. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి జిల్లా ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పార్టీలో స్తబ్దత నెలకొంది. పార్టీని బలోపేతం చేయడం ద్వారానే పూర్వ వైభవం సాధ్యమని అధిష్ఠానం భావించింది. 


జిల్లాపరిషత్‌, మండల పరిషత్‌ మలి దశ ఎన్నికల్లో టీడీపీ కూడా బాగా పుంజుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కూడా గట్టి షాక్‌ తగిలింది. హిరమండలం జడ్పీటీసీకి పోటీచేసిన ఆమె తనయుడు రెడ్డి శ్రావణ్‌ ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు 59 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 10 వైసీపీ, 5 టీడీపీ గెలుచుకున్నాయి. తూర్పుగోదావరిలో 21 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగగా.. వైసీపీ ఎనిమిది చోట్ల గెలిచింది. టీడీపీ ఆరు చోట్ల గెలిచింది. 

Advertisement
Advertisement