Abn logo
Mar 5 2021 @ 10:14AM

వామ్మో.. `సలార్`‌కు భారీ ఆఫర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `సలార్`. తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదలకు ఏడాదికి పైగానే సమయం ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్‌లో సాగుతోందట. ఈ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి కళ్లు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయట.

 ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రయత్నిస్తోందట. ఏకంగా వంద కోట్ల రూపాయల ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు కూడా అమేజాన్ నుంచి ఈ రేంజ్ ఆఫర్ ఇప్పటివరకు రాలేదు. ప్రభాస్‌కు భారత్‌లోని అన్ని రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులున్నారు. అందుకే `సలార్` కోసం అంత మొత్తం వెచ్చించేందుకు అమేజాన్ సిద్ధపడుతోందట. ప్రసుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రముఖ కథానాయిక శ్రుతీహాసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. 

Advertisement
Advertisement
Advertisement