Jul 31 2021 @ 08:44AM

పవర్ స్టార్ - రానా మూవీకీ భారీ ఆఫర్..?

తెలుగులో రూపొందుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటిలు నటిస్తున్న మూవీ కూడా ఒకటి. ఈ మూవీని యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మళయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పణం కోషియం' తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు భారీ ఆఫర్ ఇచ్చారట. దాదాపు 23 కోట్లకు ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. 

అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం మేకర్స్ నుంచి రాలేదు. కాగా 'భీమ్లా నాయక్' అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తుండగా, ఇటీవల మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి భారీగా అంచనాలు పెంచేసింది చిత్ర బృదం. ఇందులో పవన్‌కి జోడిగా నిత్యా మీనన్ నటిస్తోంది. తాజాగా ఆమె సెట్‌లో కూడా జాయిన్ అయింది. ప్రస్తుతం నిత్యాపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే రానాకి జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతి బరిలో ప్రభాస్ 'రాధే శ్యామ్', మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లతో ఈ మూవీ దిగబోతోంది.