May 9 2021 @ 14:05PM

'ఖిలాడి'కి భారీ ఆఫర్..?

మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న 'ఖిలాడి' సినిమాకు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల ఇటలీలో కొంత షూటింగ్ జరిపి కరోనా సెకండ్ వేవ్ కారణంగా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో తిరిగి ఇండియాకి వచ్చేశారు. త్వరలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా.. అనసూయ, అర్జున్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవీశ్రిప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ 'క్రాక్' సినిమాతో భారీ హిట్ అందుకొని ఫుల్ ఫాంలోకి రావడంతో 'ఖిలాడి' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారణంగానే అమెజాన్ వారు దాదాపు రూ. 45 కోట్ల వ‌ర‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆఫర్‌ను మేకర్స్ ఒప్పుకున్నారా లేదా తెలియాల్సి ఉంది.