Abn logo
Mar 28 2020 @ 12:20PM

అఖిల్ కోసం భారీ చిత్రం..!

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత అఖిల్ ఏ సినిమా న‌టిస్తాడ‌నేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అఖిల్ నెక్ట్స్ మూవీని భారీ బ‌డ్జెట్‌లో నిర్మించ‌డానికి నాగార్జున రెడీ అవుతున్నాడ‌ట‌. ఓ యువ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు అఖిల్‌కు హీరోగా ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌ను అందించ‌లేక‌పోయాయి. ఇప్పుడు త‌దుప‌రి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా అఖిల్ అడుగులేస్తున్నాడ‌ని టాక్.

Advertisement
Advertisement
Advertisement