Abn logo
Aug 4 2020 @ 02:00AM

దర్జీలు వారే..

భూమిపూజ నాడు రామ్‌లల్లా ధరించే వస్త్రాలను భగవతీలాల్‌, శంకర్‌లాల్‌ పహాడీ సోదరులు కుట్టారు. నాలుగు తరాలుగా వీరి కుటుంబమే వస్త్రాలను రూపుదిద్దుతోంది. వీరు కేవలం దేవతావిగ్రహాలు, సాధువులకు మాత్రమే వస్త్రాలను కుడతారు. తన తండ్రి బాబూలాల్‌ 1985 నుంచి రామ్‌లల్లాకు బట్టలు కుట్టడం ప్రారంభించారని.. కుట్టు మిషన్‌ తీసుకుని రామజన్మభూమి ప్రదేశానికి తమను తీసుకు వెళ్లేవారని.. అక్కడే స్వామికి వస్త్రాలు కుట్టేవారని శంకర్‌లాల్‌ (54) వెల్లడించారు. ఈసారి తాము పచ్చ, నారింజ రంగుల వస్త్రాలు తయారుచేశామని చెప్పారు. తొమ్మిది రత్నాలను బంగారు రంగు దారంతో కుట్టామని వెల్లడించారు. వీటిని ఆదివారంనాడు తమకు వారు అప్పగించారని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సతేంద్రదాస్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement