Advertisement

‘భీమ్లా నాయక్’: టీజర్‌కు డేట్ ఫిక్స్..?

మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు అఫీషియల్ తెలుగు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సైనట్టు తాజా సమాచారం. త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త హెగ్డే కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 15న చిత్రబృందం ‘భీమ్లా నాయక్’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  

Advertisement
Advertisement