Bheemlaa nayak: పవన్ పాడిన పాటే రాబోతుందా..?

సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ “భీమ్లా నాయక్”. ఈ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కు తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా..నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, ఇందులోనుంచి మరో సాంగ్‌ను వదలబోతున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అయితే, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాట పవన్ కళ్యాణ్ పాడిన పాట అని తెలుస్తోంది. ఇంతకముందు ఆయన 'అజ్ఞాతవాసి' సినిమాలో 'కొడకా కోటేశ్వర రావా' అనే పాట పాడిన సంగతి తెలిసిందే. అంతకముందుకు కూడా బిట్ సాంగ్స్ పాడారు. ఇప్పుడు మరోసారి “భీమ్లా నాయక్” మూవీలో ఓ పాట పాడారాని, అదే త్వరలో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Advertisement
Advertisement