Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 27: రామేశ్వరంలోని భద్రావతి, భావన్నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బిందెసేవను వైభవంగా నిర్వహించారు.  పద్మశాలీయ బహుమత్తమ సంఘం ఆధ్వర్యంలో ఉదయం హనుమత్‌లింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని, అమ్మవారిని ఆవాహన చేసిన వివిధ కళశాలను తలపై ఉంచుకుని పురవీధుల్లో ఊరేగించారు. దారి వెంబడి డప్పు వాయిద్యాలతో బిందెసేవ ను కన్నుల పండువగా నిర్వహించారు.  కార్యక్రమంలో రామేశ్వరం పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు మేరువ పెంచలయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నందం కుమార్‌, కోశాధికారి గునిశెట్టి సురే్‌షబాబు, నందం రామయ్య, మేరువ ప్రసాద్‌, మేరువ మూర్తి, నాగమల్ల శంకర్‌, పోలంకి వరదరాజులు, జింకా రామకృష్ణ, ఆనంద్‌, సింగరయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు. కాగా  శ్రీరామనగర్‌లోగల భద్రావతి భావన్నారాయణస్వామి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం బిందెసేవ మహోత్సవాన్ని కన్నుల పండువగా పద్మశాలీయ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో భద్రావతి, భావన్నారాయణస్వామి ఆలయం నుంచి శివాలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లి అక్కడ స్వామి, అమ్మవార ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కేరళ సింగారిమేళం, మంగళవాయిద్యాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఆదివారం మధ్యాహ్నం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 

Advertisement
Advertisement