Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంకట్రామరెడ్డి జుగుప్సాకరమైన వ్యక్తి: భట్టి

హైదరాబాద్: మాజీ కలెక్టర్, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి జుగుప్సాకరమైన వ్యక్తని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంటనే చీఫ్ సెక్రెటరీ ఎలా అమోదించారని ప్రశ్నించారు. సీఎం ఎం ఆలోచిస్తున్నారనేది అర్థం కావడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కారని, అధికారిగా తన విలువైన సమయాన్ని టీఆర్ఎస్ పార్టీ కోసం వెచ్చించారని ఆరోపించారు. దేశంలో ఉన్న బ్యూరో క్రాట్ వ్యవస్థకు వెంకట్రామరెడ్డి... చీకటి కోణమని, ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థ నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు. అతనిపై చట్ట పరంగా ఆలోచించి ముందుకు వెళ్ళతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement
Advertisement