Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 14 2021 @ 14:21PM

నెహ్రూ వేసిన అభివృద్ధి పునాదులను కూల్చవద్దు: భట్టి

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం పోరాటం వల్ల రాలేదని, భిక్ష అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై  సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది భిక్ష కాదని, ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగమని అన్నారు. భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందంటే జవహర్ లాల్ నెహ్రూ వేసిన బాట అని, ఆయన వేసిన అభివృద్ధి పునాదులనుకూల్చవద్దని, దేశ ఆస్తులను అమ్మవద్దని కేంద్రాన్ని భట్టి డిమాండ్ చేశారు.


దేశం బలంగా నిర్మాణమవ్వడానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని భట్టి విక్రమార్క అన్నారు. కొందరు తమ స్వార్థం కోసం దేశ స్వాతంత్ర్యంతో సంబంధం లేనివారిని.. స్వాతంత్ర్య ఉద్యమకారులుగా చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. హుజురాబాద్ రివ్యూ చాలా అర్ధవంతంగా జరిగిందన్నారు. హుజురాబాద్ సమీక్షపై వచ్చిన ఏ వార్త కూడా నిజం కాదని, సమావేశం తర్వాత తాము చెప్పిందే వాస్తవమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement