Sep 28 2021 @ 15:47PM

అరెరె.. ఇదేంటి Salman భాయ్.. నెటిజన్లకు ఇలా దొరికిపోయావేంటి..?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన `టైగర్-3` సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం రష్యా, టర్కీ వంటి దేశాలలో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే `బిగ్‌బాస్-15` కార్యక్రమం ప్రారంభమవుతోంది కాబట్టి.. దాని కోసం ఆదివారం ముంబై వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో అభిమానుల కంటపడ్డాడు. బ్లాక్ టీ-షర్టు, దాని మీద బ్లూ షర్ట్ వేసుకున్న సల్మాన్ బ్లాక్ మాస్క్ ధరించాడు. అయితే ఆ మాస్క్ తిరగేసి వేసుకున్నాడు. 


దానిని గమనించిన నెటిజన్లు సల్మాన్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. `భాయ్.. మాస్క్ తిరగేసి వేసుకున్నావు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న `బిగ్‌బాస్`-15ను హోస్ట్ చేస్తున్నందుకు సల్మాన్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడట. ఈ సీజన్‌కు గాను సల్మాన్ ఏకంగా రూ.350 కోట్లు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Bollywoodమరిన్ని...