Abn logo
Jul 14 2020 @ 15:47PM

`తలైవి`లో భాగ్యశ్రీ పాత్ర ఏంటో తెలుసా?

సినిమాలకు కొద్దికాలం బ్రేక్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ మళ్లీ పునరాగమనం చేయబోతోంది. ప్రభాస్ `రాధేశ్యామ్` సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి`లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోందట. 


`తలైవి`లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత తల్లి వేదవల్లి పాత్రలో భాగ్యశ్రీ  నటించబోతోందట. సంధ్యగా పేరు మార్చుకుని వేదవల్లి కూడా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. జయలలిత వ్యక్తిగత, సినీ జీవితంలో ఈమెది ప్రధాన పాత్ర. వారిద్దరి మధ్య అనుబంధాన్ని సినిమాలో చూపించనున్నారట. ఆ పాత్రలో నటించేందుకు భాగ్యశ్రీ ఓకే చెప్పిందట. 


Advertisement
Advertisement
Advertisement