Abn logo
Sep 20 2020 @ 03:45AM

బీఎఫ్‌ఐ ఎన్నికలు వాయిదా

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఎన్నికలు వాయిదాపడ్డాయి. దాంతో అజయ్‌సింగ్‌ అధ్యక్షుడిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మరో మూడు నెలలు పదవిలో కొనసాగనుంది. ఈ మేరకు శనివారం జరిగిన సమాఖ్య ప్రత్యేక సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కమిటీ నాలుగేళ్ల పదవీకాలం ఈనెల 25తో ముగియనుంది. ప్రత్యేక సాధారణ సమావేశానికి ఆసియా బాక్సింగ్‌ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనాస్‌ అలోటాబియా, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా హాజరయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement