Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త దుర్మార్గాన్ని బయటపెట్టిన భార్య..women policeకు ఫిర్యాదు

బెంగళూరు(కర్ణాటక): భర్త అశ్లీల వీడియోల వ్యసనంపై భార్య మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో వెలుగుచూసింది. భర్త పోర్న్ వీడియోలు చూడటంపై తాను అభ్యంతరం చెప్పడంతో తనను వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు చేసింది. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల మహిళను 2019లో ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నాటి నుంచి తన భర్త పోర్న్ సైట్‌లకు అలవాటు పడ్డాడని, రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసేవాడని స్థానిక కోర్టులో తన పిటిషన్‌లో మహిళ పేర్కొంది. ఆ అమ్మాయిల కోసం డబ్బు కూడా ఖర్చు పెట్టాడని మహిళ చెప్పింది.

తన భర్త అనేక పోర్న్ వెబ్‌సైట్‌లను సబ్‌స్క్రైబ్ చేశాడని, అమ్మాయిలకు కాల్ చేయడానికి తన ఫొటోలు కూడా పంపాడని బాధిత వివాహిత చెప్పింది. తన భర్త మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్‌ను కూడా సృష్టించాడని,  అందులో విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నాడని బాధిత భార్య  పేర్కొంది.తన భర్త అలవాట్ల గురించి అతని తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేశానని, అతనికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు మహిళ తెలిపింది. అయితే భర్త ఏమీ మారలేదని ఆమె చెప్పింది.తన భర్త అలవాట్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనను వేధించడంతోపాటు చద్ది అన్నం తినమని ఇచ్చారని ఆమె పేర్కొంది.

భర్త ప్రవర్తనపై తాను అభ్యంతరం వ్యక్తం చేసినందుకు అతను తనను వేధించడం ప్రారంభించాడని, అతని తల్లిదండ్రులు కూడా అతనికి మద్దతు ఇచ్చారని బాధితురాలు చెప్పారు. వారు చద్ది అన్నం పెట్టి తినమని బలవంతం చేశారని,  తనను కుటుంబ కార్యక్రమాలకు కూడా తీసుకెళ్లకుండా తప్పించారని మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది.మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల ప్రకారం బసవనగుడి మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement