Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 13:15PM

బెంగళూరులో.. నిలకడగా కరోనా కేసులు

బెంగళూరు: రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయని మరికొద్ది రోజులు ప్రజలు అప్రమత్తత పాటించాలని బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త పిలుపునిచ్చారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మా ట్లాడారు. నగరంలో ప్రతిరోజూ కొవిడ్‌ కేసులు 300 లోపు ఉండేలా నియంత్రించడంలో విజయం సాధించామన్నారు. బీబీఎంపీ చేపట్టిన చర్యలు కొవిడ్‌ నియంత్రణకు దోహదపడుతున్నాయన్నారు. నగరంలో రోజూ ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య 30లోపే ఉంటుందన్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా పలు ఆసుపత్రులలో 368మంది కొవిడ్‌కు చికిత్సలు పొందుతున్నారని, వీరిలో 260మంది జనరల్‌ వార్డులలో ఉన్నారన్నారు. వ్యా క్సినేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనన్నారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్నవారు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, భౌతికదూరం పాటిస్తూ మాస్కు ధరించాలని ఆయన సూచించారు. 


Advertisement
Advertisement