Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండూరుపాళెం బీచ్‌లో పారిశుధ్య పనులు

కోట/వాకాడు, డిసెంబరు 7 : కోట మండలం విద్యానగర్‌ ఎన్‌బీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం పలు పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. శుభ్రత, పరిశుభ్రతపై విద్యానగర్‌, ప్రకాశంకాలనీల వాసులకు  వారు అవగాహన కల్పించారు. అనంతరం వాకాడు మండలం కొండూరుపాళెం సముద్రతీరంలో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. పునీత్‌సాగర్‌ అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. తీరప్రాంతాల వాసులకు పారిశుఽధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నావల్‌ అధికారి డాక్టర్‌ మల్లికార్జునరెడ్డి, సుధాకర్‌, ఎన్‌బీకేఆర్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement