Abn logo
Sep 23 2021 @ 19:17PM

ఇన్వెస్టర్ల ఊపుతో...

లండన్ / న్యూయార్క్ : అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థ‌లు ప్ర‌వేశంచ‌డంతో స్పేస్ టూరిజం వేగాన్ని పుంజుకుంటోన్న విషయం తెలిసిందే. వ‌ర్జిన్ గెలాక్టిక్‌, అమెజాన్ బ్లూ ఆరిజిన్‌, స్పేస్ ఎక్స్ సహా మరికొన్ని సంస్థలు అంత‌రిక్ష ప‌రిశోధ‌నారంగంలోకి దిగ‌డంతో పోటీ పెరిగింది.  ఇప్పిటికే ఈ మూడు సంస్థ‌లు సొంతంగా త‌యారు చేసుకున్న రాకెట్ల ద్వారా స్పేస్‌లోకి వెళ్ళివచ్చిన విషయం తెలిసిందే.  కాగా... అంతరిక్ష పర్యాటకం సత్ఫలితాలనిస్తూండడంతో... రానున్న సంవత్సరాల్లో చంద్రునిపైకి పర్యాటకుల‌ను పంపేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభమయ్యాయి.


ఈ క్రమంలో... స్పేస్ ఎక్స్ స్టార్ షిప్‌ను నాసా స‌హ‌కారంతో త‌యారవుతోంది. చంద్రునిమీద‌కు వెళ్లేందుకు న‌లుగురు పర్యాటకులు సిద్దంగా ఉన్నారు. అంతరిక్షరంగంలో పెట్టుబ‌టులు పెట్టేందుకు పెట్టుబడిదారులు పెద్దఎత్తున ముందుకు వ‌స్తుండ‌టంతో అంతరిక్ష పర్యటన రంగానికి సంబంధించిన ప్ర‌యోగాలు మ‌రింత వేగవంతమయ్యాయి. కాగా... ముందస్తుగా ఇద్ద‌రు పర్యాటకులను వారం రోజులపాటు  చంద్రునిమీద‌కు పంపేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే... స్పేస్ షిప్ త‌యారవుతోంది.  ఈ ప్ర‌యోగం కోసం సుమారు రూ. 21 వేల కోట్ల మేరకు వ్యయం చేస్తున్న‌ట్టు స్సేస్ ఎక్స్ వెల్లడించింది.