Abn logo
Jul 31 2021 @ 00:57AM

రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి

ఎలుగుబంటి కళేబరం

కళ్యాణదుర్గం, జూలై 30: పట్టణ సమీపంలోని అక్కమాంబ కొండ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఎలుగుబంటిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సబ్‌ డీఎ్‌ఫఓ శామ్యూల్‌, రేంజర్‌ రామ్‌సింగ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరానికి పంచనామా నిర్వహించారు. అనంతరం అటవీప్రాంతంలో కాల్చివేసినట్లు రేంజర్‌ తెలిపారు.