Abn logo
Jul 11 2020 @ 05:38AM

భయం వద్దు... ధైర్యమే మందు

జాగ్రత్తలే వైరస్‌ను    దరిచేరనీయవు

కరోనా కేసుల్లో  మరణాలు ఒక్క శాతమే

రిమ్స్‌ నుంచి  డిశ్చార్జిలు

ఇప్పటివరకు   782మంది కోలుకున్నారు

జిల్లాలో 22 మరణాలు..   ఇతరచోట్ల ఆరు 

మృతదేహాల్లో వైరస్‌ ఉండదు

రిమ్స్‌ సూపరింటెండెంట్‌    డాక్టర్‌ శ్రీరాములు


భయం ఏ మాత్రం వద్దు.. కరోనా వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వచ్చినా వైద్యం చేయించుకుంటూ, పోషకాహారం తీసుకుంటూ ధైర్యంగా ఉంటే వెంటనే కోలుకుంటారు. ఈ ఏడాది మార్చి 19న జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పటికి వెయ్యికిపైగా పాజిటివ్‌లు  వెలుగు చూశాయి. వీరిలో 782 మంది  ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లి  సాధారణ జీవితం గడుపుతున్నారు. కరోనా సోకిన బాధితుల్లో 100కి ఒక్కరు మాత్రమే మృతి చెందుతున్నారు. ఇతర జబ్బుల్లో అయితే ఇంకా ఎక్కువ మందే చనిపోతారు’. ఇవీ రిమ్స్‌ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు చెప్పిన విషయాలు. శుక్రవారం ఆయన ‘ఆంరఽధజ్యోతి’తో మాట్లాడారు. వైరస్‌పై తగిన అవగాహన లేకపోవటం, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వైరస్‌ బారినపడటంతో సర్వత్రా భయాందోళనకు గురవుతున్నారన్నారు. అయితే ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ధైర్యంగా కరోనాను జయించవచ్చని ఆయన  తెలిపారు. కరోనా వైరస్‌ గురించి ఆయన మాటల్లోనే.. 


ఒంగోలు నగరం : జిల్లాలో ఇప్పటి వరకూ 1100కుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. 28మంది చనిపోయారు. వారిలో ఆరుగురు హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, చెన్త్నె నగరాల్లో మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అప్పటికే బాధపడుతుండటమో లేక వృద్ధాప్యంలో ఉన్నవారే. కానీ 99శాతం మంది వైద్యం పొంది తిరిగి ఆరోగ్యవంతులై ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం వారు ఆరోగ్యవంతమైన సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. 


అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్‌కు...

ఎవరికి వారు తమ వంతు కర్తవ్యంగా వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలి. నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. పండ్లు, డ్రైఫ్రూట్స్‌, మాంసం తదితర వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.   భయపడకూడదు. వైరస్‌ వచ్చిన తర్వాత చికిత్సపొందే కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. మాస్కు కట్టుకోవటం, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయాసం, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఇతరులకు దూరంగా ఉండాలి.


హోం ఐసోలేషన్‌కు కూడా అవకాశం ఉంది

ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి కేవలం ఆసుపత్రిలోని ఐసోలేషన్‌లోనే చికిత్స అందుబాటులో ఉండేది. తాజాగా ఐసీఎంఆర్‌ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందే అవకాశం ఏర్పడింది. పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం వచ్చిన వారికి ఈ హోంఐసోలేషన్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. కరోనా లక్షణాలు బయటకు కనిపించని వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తారు. వారి నివాసంలో ప్రత్యేక గది, మరుగుదొడ్డి ఉండాలి. వారి ఇళ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడుతున్న వారు ఉండకూడదు.  ఇలాంటి వారికే హోం ఐసోలేషన్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 


మృతదేహాల్లో వైరస్‌ ఎక్కువసేపు ఉండదు

కరోనా బారినపడి మరణిస్తున్న వారి పట్ల కూడా సమాజంలో అనేక అపో హలు ఉన్నాయి. ప్రాణంతో ఉన్న దేహంలోనే వైరస్‌ బతికి ఉంటుంది. శరీరంలో వైరస్‌ రెట్టింపు స్థాయిలో అభివృద్ధి అవుతుంది. అదే మృతదేహంలో అయితే వైరస్‌ మనుగడు సాధించలేదు. బ్యాక్టీరియా మాత్రమే మనగలుతుంది కానీ వైరస్‌ ఎక్కువసేపు బతకలేదు. మనిషి చనిపోయిన ఆరు గంటల తర్వాత అత ని శరీరంలో వైరస్‌ బతికి ఉండదు. అయితే భయంతో చాలా మంది మృతదేహాలను శ్మశానాల్లో ఖననం చేసేందుకు అంగీకరించడం లేదు.  

Advertisement
Advertisement
Advertisement