Abn logo
Sep 27 2020 @ 03:03AM

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం

Kaakateeya

వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వలంటీర్లు

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి 


బనగానపల్ల్లె, సెప్టెంబరు: గ్రామ సచివాలయ వ్యవస్థ అలంకారప్రాయంగా మారి నిర్వీర్యమై పోయిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, సచివాలయాల ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. అయితే సచివాలయాల ద్వారా వైసీపీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ వచ్చినప్పట్నుంచి గ్రామాల్లో పారిశుధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. సెక్రటరీలు ఏనాడూ గ్రామాల్లో పర్యటించలేదని ఆరోపించారు.


వైపీపీ కార్యకర్తల్లా వలంటీర్లు

వలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగించడం, వైఎస్సార్‌ చేయూత, అమ్మఒడి వంటి పథకాలు అర్హులకు అందకుండా అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై నిలదీస్తే టీడీపీకి చెందిన వారు కావడంతో తొలగించామంటూ బహిరంగంగా నిస్సిగ్గుగా చెబుతున్నారన్నారు. వారికి ఎంపీడీవోలు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. వలంటీరు వ్యవస్థ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీసీ విమర్శించారు. కార్యక్రమంలో బీసీతో పాటు టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన్‌, బురానుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement