Abn logo
Oct 20 2020 @ 00:00AM

బీసీ కార్పొరేషన్లు నేతి బీరకాయలు

 పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

వేంపల్లె, అక్టోబరు 19: నిధులు లేని బీసీ కార్పొరేషన్లు నేతి బీర కాయల్లాంటివని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వేంపల్లెలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న బీసీ కార్పొరేషన్‌ నిధులను అమ్మఒడి, వాహనమిత్ర తదితర పథకాలకు మళ్లించి కార్పొరేషన్‌ను నిర్వీర్యం, నిర్జీవం చేసి ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం తయారు చేసిందన్నారు.


నిధులు లేని బీసీ కార్పొరేషన్లు ఒకటైతేనేమి.. 56 అయితే నేమి.. 139 అయితేనేమి బీసీలకు ఒరిగేదేమిటి అని ప్రశ్నించారు. బీసీలను ఉపకులాల పేరుతో విడగొట్టి, బీసీల ఐక్యతను జగన్‌ దెబ్బతీశాడన్నారు. 1970లోనే కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో 25శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు.  


Advertisement
Advertisement