Abn logo
Oct 24 2020 @ 16:36PM

బాలీవుడ్ పాటలో బతుకమ్మ... దీనికి కారణం ఆయనే!

Kaakateeya

ఈ పాపులర్ హిందీ పాట 1969లో వచ్చిన ‘శత్రంజ్’ అనే హిందీ సినిమాలోనిది. ‘బతుకమ్మ.. బతుకమ్మ.. ఎక్కడ పోతావ్ రా... ఎంకన్న ఎంకన్న.. ఇక్కడ రా’ అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. అమరగాయకుడు మహమ్మద్ రఫీ, శారదా రాజన్ ఈ పాట పాడారు. ఆనాడు ప్రతి స్టేజ్‌పై ఈ పాట వినపడేది. సంగీత దర్శక ద్వయం శంకర్ - జై కిషన్ ఈ పాటకు బాణీలు కూర్చారు. వీరిలో శంకర్‌ భాగ్యనగర వాసి. అందుకే బతుకమ్మ, ఎంకన్న పేర్లను పాటలో ఉపయోగించి ఉంటారని అంటుంటారు. ఓ మ్యూజిక్ షోలో మహమ్మద్ రఫీ తదితరులు పాడగా.. ఆ అరుదైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  


బాలీవుడ్ గీతాల్లో తెలుగు పదాలను అప్పట్లో బాగా ఉపయోగించేవారు. విఖ్యాత నటుడు రాజ్ కపూర్ నటించిన ‘శ్రీ 420’ సినిమాలోనూ ఓ పాటలో తెలుగు పదాలు వస్తాయి. ‘‘రామయ్యా వస్తావయ్యా... రామయ్యా వస్తావయ్యా’’ అన్న పాట ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. ఈ సినిమాకు శంకర్ - జై కిషన్ ద్వయం సంగీతమందించింది.

Advertisement
Advertisement