Abn logo
Oct 24 2020 @ 04:53AM

ఎంసీహెచ్‌ఆర్‌డీలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ తెలంగాణ పండుగ అయినప్పటికీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటున్నారని డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య అన్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. అనంతరం ఎంసీహెచ్‌ఆర్‌డీలో నూతనంగా అభివృద్ధి చేసిన బతుకమ్మ ట్యాంక్‌ వద్ద మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా ఆడి, పాడారు. బతుకమ్మ సరోవర్‌లో అందంగా పేర్చిన బతుకమ్మలను వదిలారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారులు హర్‌ప్రీత్‌సింగ్‌, మహేష్‌ దత్‌ ఎక్కా, అధికారులు, అధ్యాపక సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement