Abn logo
Oct 24 2020 @ 05:44AM

చిత్తూచిత్తూల బొమ్మ... శివునీ ముద్దులగుమ్మ

పాలమూరు, అక్టోబరు 23: ‘చిత్తూ.. చిత్తూల బొమ్మ శివునీ ముద్దులగుమ్మ’ అంటూ పాటలు పాడుతూ జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అధికార నివాసంలో మహిళా జడ్పీటీసీలు, కవులు శుక్రవారం బతుకమ్మ ఆడారు. పాలమూరు మహిళా సాహితి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీరొక్క పూలను వరుసలుగా పేర్చి, అందాల అతివలంతా ఒక్కచోట చేరి సందడిగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని చెప్పారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రత్యేకమైన పండుగ ఇదని అన్నారు. వేడుకల్లో రచయిత్రులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, ఎన్‌.సుభాషిణి, చుక్కాయపల్లి శ్రీదేవి, భారతి, పలువురు కవులు, మహిళా జడ్పీటీసీలు చిన్నచింతకుంట రాజేశ్వరి, హన్వాడ విజయనిర్మల, మహబూబ్‌నగర్‌ వెంకటేశ్వరమ్మ, బాలానగర్‌ జె.కళ్యాణి, దేవరకద్ర జి.అన్నపూర్ణ, జి.సుజాత పాల్గొన్నారు.

Advertisement
Advertisement