Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీకాఫ్ రోజు డ్యూటీకి రమ్మంటూ రాత్రి 2 గంటలకు బాస్ నుంచి మెసేజ్.. మద్యం మత్తులో ఉన్న ఆ ఉద్యోగికి చిర్రెత్తుకొచ్చి ఏం చేశాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఎవరైనా సరే వారం రోజులపాటు పని చేసిన తర్వాత వీకెండ్ రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. పని ఒత్తిడిని దూరం చేసుకుందాం అని భావిస్తారు. ఓ బార్‌లో సర్వర్‌గా పని చేసే ఓ వ్యక్తి కూడా పాపం ఇలానే అనుకున్నాడు. వారం రోజులు కష్టపడ్డి.. వీకాఫ్ రోజు తనకు నచ్చిన డ్రింగ్‌ను తాగి బెడ్‌పై పడుకున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా 2.59 గంటలకు తన బాస్ నుంచి మెసేజ్ రావడంతో అతడు కంగుతిన్నాడు. విషయం ఏంటా అని మెసేజ్ ఓపెన్ చేయగా.. అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు..  అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..  


ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న బార్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. వారం రోజులపాటు డ్యూటీకి వెళ్లిన అతడు తన వీకాఫ్ రోజు మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తనకు నచ్చిన మద్యం బాటిల్‌ను రూంకు తెచ్చుకుని.. దానిని తాగేసి బెడ్‌పై పడుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తన బాస్ నుంచి సరిగ్గా రాత్రి 2.59 గంటలకు మెసేజ్ వచ్చింది. అప్పటికి అతడికి నిద్ర పట్టకపోవడంతో.. బాస్ నుంచి వచ్చిన మెసేజ్‌ను ఓపెన్ చేశాడు. తనను రేపు డ్యూటీకి రమ్మంటూ బాస్ మెసేజ్ పెట్టడాన్ని చూసి అతడు కంగుతిన్నాడు. అనంతరం తాను మద్యం సేవించానని, వీకాఫ్ రోజు డ్యూటీకి రాలేనని మర్యాదపూర్వకంగా తన బాస్‌కు తిరిగి సందేశం పంపించాడు. 


ఈ క్రమంలో అతడి బాస్.. అందుకు ఒప్పుకోలేదు. రేపు కచ్చితంగా డ్యూటీకి రావాల్సిందే అంటూ అతడికి మెసేజ్ పెట్టడమే కాకుండా.. మద్యాన్ని ఎక్కువగా తీసుకోకు అంటూ సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో సదరు సర్వర్‌కు చిర్రెత్తుకొచ్చింది. బాస్‌పై తన అసహనాన్ని వ్యక్త పరిచాడు. అంతేకాకుండా అతడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు బాస్‌కు మెసేజ్ పంపాడు. అనంతరం తనకు తన బాస్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement