మెడలో ఎప్పుడూ బంగారపు చైన్లతోనే కనిపించే Bappi Lahiri మొత్తం ఆస్తి ఎంతంటే...

ఆయనని అందరూ గోల్డ్ మ్యాన్ ఆప్ ఇండియా అంటుంటారు! నిజానికి బప్పీ లహరీని గోల్డ్ మ్యానే కాదు... గోల్డ్ మైన్ అని కూడా అనవచ్చు! నిలువెత్తు బంగారపు గనిలాగా చూసే వార్ని అబ్బురపరుస్తుంటాడు బాలీవుడ్ సీనియర్ మ్యుజీషియన్!నవంబర్ 27న తన 67వ జన్మదినం జరుపుకుంటోన్న బప్పీ లహరీ బంగారం విషయంలో ఫేమస్సే. అయితే, ఆయన అసలు విశిష్టత మాత్రం బాణీలు. ఒకప్పుడు బప్పీ లహరీ బంగారం లాంటి బాణీలు బోలెడు సెన్సేషన్ సృష్టించేవి. ప్రస్తుతం ఆయన జోరు బాగా తగ్గించేశాడు. కానీ, ఇప్పటికీ ఎక్కడికైనా వస్తే తన బంగారు గోలుసులతో తళతళా మెరుస్తూ తరలివస్తుంటాడు. ఇంతకీ, ఈ బాలీవుడ్ బంగార్రాజుగారి వద్ద ఎంత గోల్డ్ ఉండొచ్చంటారు? 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బప్పీ దానే స్వయంగా తన బంగారం, ఆస్తుల వివరాలు ప్రకటించాడు!


బప్పీ లహరీ వద్ద ఉన్న బంగారం మొత్తం బరువు 752 గ్రాములట! అంటే, అటుఇటుగా 65 తులాల పుత్తడి! అంతే కాదు, గోల్డ్‌తో పాటూ సిల్వర్ కూడా బాగానే పోగేశాడు, ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాలకు సంగీతం అందించిన మన టాలెంటెడ్ మ్యుజీషియన్! 4.62 కేజీల వెండి కలిగి ఉన్నట్లు ఎలక్షన్ అపీడవిట్‌లో ఆయన చెప్పాడు. ఇక బప్పీ లహరీ భార్య చిత్రాణీ లహరీ కూడా గోల్డ్ విషయంలో యమ క్రేజీ. ఆమె వద్ద 967 గ్రాముల బంగారం, 8.9 కేజీల వెండి, వజ్రాలున్నాయి! 967 గ్రాముల బంగారమంటే 82 తులాల పైమాటే! 


బప్పీ లహరీ సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న తరుణంలో హాలీవుడ్ లెజెండ్ ఎల్విస్ ప్రెస్లీని తీవ్రంగా అభిమానించేవాడు. ఆయన మెడలో గోల్డ్ చైన్ వేసుకోవటంతో ఈయన కూడా బంగారం సెంటిమెంట్‌కి లోనయ్యాడట. ఎల్విస్ ప్రెస్లీ మాదిరిగా మెడలో బంగారంతో కనిపించటం మొదలు పెట్టాడు. క్రమంగా అదే బప్పీ దాని బంగారు బెంగాలీ బాబుగా ఫేమస్ చేసేసింది! 

Advertisement

Bollywoodమరిన్ని...