Abn logo
Jul 9 2020 @ 23:27PM

కరోనా పాజిటివ్ టైమ్‌లో బండ్ల మెనూ ఇదే..

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఎప్పుడూ తనకి ఆ టైమ్‌కి ఏది నోటి కొస్తే అది మాట్లాడేసే బండ్ల గణేష్ ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని అలాంటి మాటలే మాట్లాడి.. ఈ ఇంటర్వ్యూపై క్రేజ్ తీసుకొచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో చేయడం పెద్ద తప్పు అని సంచలన కామెంట్స్ చేసిన బండ్ల గణేష్, ఇటీవల హరీష్ శంకర్‌పై చేసిన కామెంట్స్‌పై మాటతప్పి, ఆయనతో సినిమా తీసే అవకాశం వస్తే చాలు అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడి ఆసక్తిని కలిగించారు. 


ఇక ఇటీవల తనకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం 12 రోజులలోనే ఆయన రికవరీ అవ్వడమే కాకుండా నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఇంతకీ మీరు ఏం ట్రీట్‌మెంట్ తీసుకున్నారో చెబుతారా? అంటే.. ట్రీట్‌మెంట్ ఏం లేదు.. తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటున్నారు. ఆయన కరోనాతో పోరాడిన రోజుల్లో ఏమేం తీసుకున్నారో ఆయన మాటల్లోనే.. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని తెలిసి మొదట్లో చాలా భయపడ్డా. అయితే రోజూ గుడ్లు, శొంఠి, అల్లం, వెల్లుల్లి, వేడి నీళ్లు తీసుకునేవాడిని. అంతే 12 రోజుల్లో నెగిటివ్ వచ్చేసింది. రోజూ 7 గుడ్లు తినేవాడిని. ప్రతి రోజూ శొంఠి రసం తాగేవాడిని. ఇవి తీసుకుంటే చాలు. హాస్పటల్‌కు వెళ్లి లక్షలకులక్షలు సమర్పించాల్సిన అవసరం లేదు..’’ అని బండ్ల గణేష్ తెలిపాడు. 

Advertisement
Advertisement
Advertisement