Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థికమంత్రి అంటే ముందుగా గుర్తొచ్చేది రోశయ్యే..: బండి సంజయ్

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాజకీయలు ఉన్నంత కాలం రోశయ్య జీవించి ఉంటారన్నారు. ఆర్థిక మంత్రి అంటే మెదట గుర్తొచేది రోశయ్యేనని అన్నారు. అవినీతి మరకలేని వ్యక్తి అని, రాజకీయాల్లో రోశయ్య నిజాయితీ పరుడని బండి సంజయ్ కొనియాడారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement