Abn logo
May 20 2020 @ 21:00PM

బంతిని ఉమ్మితో తుడవద్దంటే.. బౌలర్లు ఆట కోల్పోతారు: హర్భజన్

జలంధర్: కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్‌ నిబంధనల్లో కూడా మార్పులు చేయాలని క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంతిని షైన్ చేయడం కోసం ఉమ్మి వాడకంపై నిషేధం విధించాలని భావిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంపై పలువురు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టారు. ఇలా ఉమ్మి వాడకంపై నిషేధం విధించడం, ఆటను బౌలర్లకు దూరం చేస్తుందని విమర్శించాడు. ‘చెమటతో బంతిని తుడిచినా.. ఉమ్మితో తుడిస్తే వచ్చే షైన్ రాదు. ముఖ్యంగా ఉపఖండంలోని పరిస్థితుల్లో ఉమ్మి వాడకం తప్పనిసరి’ అని హర్భజన్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
Advertisement