Abn logo
Sep 27 2021 @ 00:01AM

అలరించిన ‘బాలు స్వరాభిషేకం’

పురస్కార గ్రహీతలతో మేయర్‌ మనోహర్‌నాయుడు

గుంటూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 26: స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్‌, ది ఠాగూర్‌ మెమోరియల్‌ థియేటర్‌ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన బాలు స్వరాభిషేకం ప్రేక్షకులను అలరింపజేసింది. తొలుత బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాదర్బార్‌ అద్యక్షుడు పొత్తూరి రంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా నగరపాలకసంస్థ మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, అతిథులుగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఎ. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే బత్తుల బ్రహ్మానందరెడ్డి, సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ రాము, బండి అశోక్‌రెడ్డి, మేకల రవీంద్రబాబు, బిజినేపల్లి మోహనరావు తదితరులు పాల్గొని జగదీష్‌ రచించిన ‘మన బాలు కథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ గాయనీగాయకులు రాము, విజయలక్ష్మి, వినోద్‌బాబులకు సినీగాయకుడు జి. ఆనంద్‌ మెమోరియల్‌ అవార్డులతో రామాచారి, శశకళ, యోగి సురేష్‌, శ్రీధర్‌ అయ్యర్‌, లిప్సిక, సాకేత, హరిణి, సాయి చరణ్‌లకు ఎస్‌పీ బాలు మెమోరియల్‌ అవార్డులతో ఘనంగా సత్కరించారు. సబానంతరం బాలు గీతాలతో బాలు స్వరాభిషేకం నిర్వహించారు.