Abn logo
May 22 2020 @ 03:59AM

బల్దియాలో అక్రమాలు కౌన్సిల్‌లో నిలదీస్తాం

తాండూరు : తాండూరు బల్దియా కౌన్సిల్‌ సమావేశంలో అక్రమాలను నిలదీస్తామని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వరాల శ్రీనివా్‌సరెడ్డి, మాజీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ లింగదళి రవికుమార్‌ పేర్కొన్నారు. గురువారం విలేకరులతో వారు మాట్లాడుతూ బల్దియాలో అధికారం పేరిట అనధికారిక వ్యక్తి అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 13వ వార్డులో తాను చేపట్టిన చిలుకవాగు పనులను రికార్డు చేసుకుని ఇతరులు బిల్లు పొందారని శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. తన వార్డులో తనకు తెలియకుండా పనులు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు సయ్యద్‌ సుకూర్‌, అంకిత్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement