Abn logo
May 28 2020 @ 23:48PM

బాలకృష్ణ వ్యాఖ్యలు బాధాకరం!

‘‘బాలకృష్ణగారిని పిలవకపోవడం ‘రైట్‌’ అని అనను. సమాచార లోపమో? మరో కారణమో? తెలుసుకుని ఆయన అడిగినా... తప్పేం లేదు. కానీ, భూములు పంచుకుంటున్నారని ఉక్రోషంగా ఆయన మాట్లాడిన మాట... తెలుగు పరిశ్రమలో నిర్మాతగా, ఆర్టిస్టుగా ఉన్న నాకు బాధ కలిగించింది. తక్షణమే ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలి’’ అని నాగబాబు అన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై యూట్యూబ్‌లో తన సొంత ఛానలైన ‘నా ఇష్టం’ ఛానల్‌లో ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప... భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. నాతో సహా చాలామందిని పిలవలేదు. భూములు పంచుకుంటున్నారని అనడం ఏంటి? ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా? తప్పుగా మాట్లాడారు. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారు. ఇండస్ట్రీకీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పండి. అది మీ బాధ్యత’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement