Abn logo
Mar 31 2020 @ 11:54AM

ఆ బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి బాల‌య్య నో చెప్పారా?

కొన్ని రోజుల క్రితం నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆయ‌న తండ్రి పాత్ర‌లో న‌టించ‌మ‌ని ఓ నిర్మాత రిక్వెస్ట్ చేశార‌ట‌. అందుకు ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించార‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కూ ఆ నిర్మాత ఎవ‌రో కాదట విష్ణు ఇందుకూరి అని టాక్‌. అంత‌కు ముందు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ ‘య‌న్‌.టి.ఆర్‌’ చిత్ర నిర్మాణంలో విష్ణు ఇందుకూరి భాగ‌స్వామ్యం వ‌హించారు. ఇప్పుడు జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ‘త‌లైవి’ని నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌, జ‌య‌ల‌లిత క‌లిసి చాలా చిత్రాల్లో న‌టించారు. కాబ‌ట్టి త‌లైవి బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ పాత్ర‌ను కూడా చూపించాల్సి వ‌చ్చింది. అందుకని విష్ణు ఇందూరి బాల‌య్య‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న సున్నితంగా చేయ‌లేన‌ని చెప్పార‌ట‌. అందువ‌ల్ల త‌లైవిలో సీనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర లేకుండానే చిత్రీక‌ర‌ణ‌ను చేస్తున్నార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement
Advertisement