Abn logo
Jun 3 2020 @ 18:17PM

శిల్పా చక్రపాణిరెడ్డిపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కామెంట్స్

కర్నూలు: శిల్పా చక్రపాణిరెడ్డిపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రియల్ఎస్టేట్ చేసే శిల్పా చక్రపాణిరెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం దేవస్థానం అక్రమాలకు చక్రపాణిరెడ్డి అనుచరులు రఫీ, రజాక్‌లు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం, మహానందిలో అక్రమాలపై త్వరలో మహానంది నుంచి శ్రీశైలానికి రథయాత్ర చేపడతానని బైరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్‌ హిందూ సాంప్రదాయాలను కాపాడాలని బైరెడ్డి సూచించారు. రాయలసీమలోని దేవుళ్ల సొమ్ము తిన్నోళ్లు ఎవరూ బాగుపడలేదని బైరెడ్డి అన్నారు.

Advertisement
Advertisement
Advertisement